అక్ర‌మంగా క్లాసుల‌ను నిర్వ‌హిస్తున్న కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి: AIFDS

శేరిలింగంపల్లి, మే 9 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): అనుమతులు లేని కాలేజీలను రద్దు చేయాల‌ని, అక్రమంగా సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాల‌ని AIFDS గ్రేటర్ కమిటీ ఆధ్వర్యంలో DIEOకు గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ ముత్తెన్న గారి శ్రీకాంత్ మెమొరాండం అంద‌జేశారు. అనంతరం మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండల పరిధిలో మాదాపూర్, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలలో ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ, శ్రీ చైతన్య, రిసోనన్స్, ఏలెన్, ఫిజిక్స్ వాలా, అనకాడమీ, ఆకాష్, మాడ్యులెస్, వశిష్ఠ కళాశాల యాజమాన్యలు అనేక క్యాంపస్ లు పెట్టి పరీక్షలు పూర్తయ్యాక 4 రోజులు కూడా కనీసం విద్యార్ధులకు సెలవులు ఇవ్వ‌డం లేద‌ని, 10వ తరగతి అయిపోయిన విద్యార్ధులను 1st ఇయర్, 1st ఇయర్ అయిపోయిన విద్యార్ధులను 2nd ఇయర్ లో నిర్బంధించి సమ్మర్ క్లాసెస్ పెట్టి విద్యార్ధులను వేధిస్తున్నార‌ని అన్నారు. చాలా మంది విద్యార్ధులు తల్లితండ్రులకు చెప్పుకోలేక యాజమాన్యం వత్తిడి తట్టుకోలేక విద్యార్ధి నాయకులకు సోషల్ మీడియా ద్వారా తమ బాధ వెల్లిబుచ్చుకుని రోదిస్తున్నార‌ని అన్నారు. AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ విద్యార్ధుల హక్కులను కాల‌రాస్తున్న ఆయా కాలేజీల గుర్తింపు రద్దు చేయాల‌ని, పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్న కాలేజీలను రద్దుచేసి యాజమాన్యాల‌పై క్రిమినల్ కేసులు పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here