హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు నుండి మియాపూర్ లోని పటేల్ చెరువు వరకు ఉన్న నాలా విస్తరణ పనులలో భాగంగా ఔట్ లెట్ సమస్యను, దీప్తి శ్రీ నగర్ నాలా విస్తరణ లో భాగంగా సీబీఆర్ ఎస్టేట్స్ వద్ద అసంపూర్తిగా మిగిలిపోయిన రక్షణ ప్రహరీ గోడ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, లక్ష్మారెడ్డి, ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, వెంకట్, భూషణ్ పాల్గొన్నారు.