శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): డిప్యూటీ కమీషనర్ పి. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూ విభాగం (టాక్స్ సెక్షన్) తో డిప్యూటీ కమీషనర్ ఛాంబర్ లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ కమీషనర్ మాట్లాడుతూ… ఆస్థి పన్ను లక్ష్య సాధనకు, రాబోయే ఆర్థిక సంవత్సరాంతాన్ని దృష్టిలో ఉంచుకుని, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. టాప్ డిఫాల్టర్‌లపై డిస్ట్రెస్ వారెంట్‌లు జారీ చేయాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలిచ్చారు. నోటీసుల తర్వాత కూడా పన్ను చెల్లించకపోతే, డిస్ట్రెస్ నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు.
నివాస భవనాల పేరుతో అనుమతి తీసుకుని కమర్షియల్ పొంది, వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తున్న భవనాల యజమానులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పన్ను తప్పించుకునేందుకు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్న వారిని నివాస, నివాసేతార పన్ను విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బకాయిలున్న యజమానులు (ఏరియర్స్ ఇంట్రెస్ట్) వన్ టైమ్ సెటిల్మెంట్ 90% మాఫీ ఉండకపోవచ్చని, కనుక బకాయిదారులు తమ ఆస్థి పన్నును నిర్ణీత గడువులో చెల్లించి మహా నగర అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరారు. ప్రజలు తమ ఆస్థి పన్ను ఆన్లైన్ ద్వారా, మీసేవ కేంద్రాలలో, బిల్ కలెక్టర్ వద్ద చెల్లించుకోవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ మహేందర్ రెడ్డి, ఏఎంసీ కృష్ణ, టాక్స్ ఇన్స్పెక్టర్ లు, బిల్ కలెక్టర్ లు పాల్గొన్నారు.