శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సర్కిల్ కార్యాలయంలో యుసిడి విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న తీగల శ్రీహరి ఆకస్మిక మృతి చెందారు. ఆయన మృతి పట్ల సర్కిల్ ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, యుసిడిపిఓ ఉషారాణి, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సర్కిల్ కార్యాలయ ఆవరణలో శ్రీహరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.