శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఆయా డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు,పెండింగ్ పనులు,చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారుల తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్ల లలో నెలకొన్న పలు సమస్యలకు పరిష్కారాలు, చేపట్టే పలు అభివృద్ధి పనుల తో ప్రజల ఇబ్బందులను తీర్చే విదంగా చర్యలు చేపట్టే విధంగా పలు సూచనలు ఇచ్చారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ, అభివృద్ధి కార్యక్రమాల పై సమీక్షా నిర్వహించి చేపట్టవలసిన పనులలో జాప్యం నివారణకు చర్యలు చర్చించారు. చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, అసంపూర్తిగా మిగిలిపోయిన పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలనీ, అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం ప్రథమ ప్రధాన్యతగా పనులు చేపట్టాలని, కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, శంకుస్థాపన చేసిన పనులలో జాప్యం నివారణకు చర్యల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం లో జిహెచ్ఎంసి అధికారులు EE దుర్గాప్రసాద్, EE KVS రాజు, EE గోవర్ధన్ గౌడ్, DE ఆనంద్, DE విశాలాక్షి,DE దుర్గాప్రసాద్, DE రమేష్, DE నిఖిల్, AE జగదీష్ ,AE భాస్కర్, AE ప్రతాప్, AE ప్రశాంత్, AE సంతోష్, AE సంతోష్ రెడ్డి, AE రాజీవ్, AE శ్రావణి, AE సాయి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.