- మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో, ఎన్ టి ఆర్ నగర్ లోని భారీ సెల్లార్ గుంతలో పడి బాలిక మృతిచెందింది. కాలనికి చెందిన ఆటో డ్రైవర్ నాను కూతురు రాణి (16) పదోతరగతి చదువుతున్నది. విషయం తెలుసుకున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ దాదాపు పదేళ్ల క్రితం సిరి అనే సంస్థ భారీ సెల్లార్ గుంత తీసి వదిలేసింది, ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల తరుచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. గతంలోను ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ఏదో ఒకటి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇలాంటి వ్యవహారాలు బిల్డర్ కు తగదని, పోయిన ప్రాణాలకు బాధ్యత వహిస్తూ ప్రమాద ఘటనకు కారణమైన బిల్డర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నోసార్లు పిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాన్ని ఆదుకొని తగిన న్యాయం చేయాలని కోరారు. లేదంటే గ్రామస్థులతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.