- మంజీర నీరు, డ్రైనేజీ కలుషితం
- అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం
- పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, కాలువలు
- విషజ్వరాల బారిన పడుతున్న జనాలు
- పట్టించుకోని అధికారులు ,ప్రజా ప్రతినిధులు.
- విచ్చలవిడిగా రాత్రింబవళ్ళు బెల్ట్ షాపులు, నిద్ర మత్తులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్
- పలు సమస్యలపై పర్యటించిన కొండాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు ఆంజనేయులు సాగర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై సిద్దిక్ నగర్ లో బస్తీ బాట నిర్వహించి పర్యటించారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ రెండు మూడు నెలల క్రితం గుట్టల బేగంపేట్ మాదాపూర్ లో కలుషిత నీరు తాగి ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు మరణించిన విషయం మరవక ముందే.. ఇప్పుడు అలాంటి సమస్యే సిద్దిక్ నగర్ లో నెలకొన్నదని అన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ఫలితంగా ఆ నీరు తాగుతున్న స్థానికులు అవస్థలు పడుతున్నారని, అనారోగ్యాల భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు అధికారులు, జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో బస్తీ సమస్యలు తీర్చాలని, లేకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అధికారులకు తెలిపారు. అంతేకాక స్కూల్ ఆవరణలో చెత్తాచెదారం కుప్పలు కుప్పలుగా పేరుకుపోవడంతో భరించలేనంతగా వస్తున్న దుర్వాసనతో విద్యార్థులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ప్రధానంగా బస్తీలో పగలు రాత్రి తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం షాపులు నిర్వహిస్తూ ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ కార్యక్రమంలో, రఘునాథ్ యాదవ్, ఆంజనేయులు సాగర్, సంతోష్, రవి నాయక్, పద్మ, రేఖ, రేణుక, సరోజ, బల్లు యాదవ్, వెంకటరమణ, సురేష్ సాగర్, మాన్యంకొండ, చెన్నయ్య, కిషన్ జి, చందు, మల్లికా, నాగూ భాయ్, సాయి , పృథ్వి, వెంకటేష్ , నరసింహ, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
