నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ , హఫీజ్ పేట్ డివిజన్, ఓల్డ్ హఫీజ్ పేట్ విలేజ్ చౌరస్తా వద్ద , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ ఆద్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకి ఈ రోజు అసలైన స్వాతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో రజాకారులను తరిమికొట్టిన ఉక్కుమనిషి ఆయన అని అన్నారు. పటేల్ గారిని జీవితంలో గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, బీజేపి నాయకులు జగన్ గౌడ్, శివ ముదిరాజ్, బీజేవైఎం నాయకులు శివాజీ, ఆనంద్ కుమార్, నవీన్ రెడ్డి, నందు, శివ యాదవ్, మహేశ్ గౌడ్, సాయి సుకుమార్ పటేల్, సతీష్ గౌడ్, భాస్కర్, సంజయ్ గౌడ్, సలీమ్, మనోజ్, రాజు, జై కిరణ్ మరియు ఇతరులు పాల్గొన్నరు.