శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): సావిత్రిబాయి ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని సురభి కాలనీ ఎంపిపిఎస్ పాఠశాలలో సామాజిక ఉద్యమకారిణి సావిత్రిభాయి పూలె జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంను మదర్ సేవ సమితి ట్రస్ట్ ఛైర్మెన్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిపిఎస్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు కార్పొరేటర్ శాలువా కప్పి, పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాపిరెడ్డి కాలనీ మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి, కేంద్ర సాహిత్య పురస్కార అవార్డు గ్రహిత ప్రొఫెసర్ పసునూరి రవీందర్, ఎంపిపిఎస్ పాఠశాల హెచ్ఎం పాండురంగ రెడ్డి, వార్డ్ మెంబర్ శ్రీకళ, ఎంపిపిఎస్ మాజీ ఎస్ఎంసీ ఛైర్మెన్ బస్వరాజ్, దేవదాస్, సురభి కాలనీ ప్రెసిడెంట్లు చంద్రశేఖర్, వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆశ్రఫ్, మౌనిక, వనిత, మాధవి, విజయ, మహేశ్వరి, మల్లికాంబ, పూజిత, మరియు వేణు, గోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, షఫీ, ఎం కొండల్ రెడ్డి, కుమార్, ప్రవీణ్, రమణ రెడ్డి, నరసింహ, తుకారామ్ తదితరులు పాల్గొన్నారు.