శేరిలింగంపల్లి, జనవరి 3 (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక సంస్కర్త,ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి నియోజకవర్గ నాయకులతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్యామ్,లోకేష్,భుజంగం,శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.