శిల్పారామంలో ముగిసిన సంక్రాంతి సంబురాలు.. అల‌రించిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు..

మాదాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబురాల్లో భాగంగా చివరి రోజు సుధీర్ రావు శిష్య బృందంచే నిర్వ‌హించిన‌ కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. గణేష్ ప్రార్ధన, అలారులు కురియగా, స్వాగతం కృష్ణ, శివాష్టకం, కామాక్షి స్తుతి, జనుత శబ్దం, వచ్చెను అలమేలుమంగా, గోవర్ధన గిరిధర తరంగం అంశాలను ప్రదర్శించారు. కళాకారులు హిమాన్సీ చౌదరి, శిశిర కోకిలవని, కుందూరు అణిశ్రిత రెడ్డి, సోనాక్షి రెడ్డిలు నృత్యాన్ని ప్రదర్శించి మెప్పించారు.

కూచిపూడి నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రిస్తున్న క‌ళాకారులు

సైబరాబాద్ పోలీస్ జాగృతి కళా బృందం సోషల్ మీడియాలో యువత ఎంత తప్పుదారి పడుతుందో, అమ్మాయిలకు ఇబ్బందులు వస్తే, విద్యార్థులు తప్పు దారి పడితే, ఈవ్ టీజింగ్ వ‌ల్ల‌ ఇబ్బందులు వస్తే పోలీసు వారిని ఎలా సమీపించాలో, పోలీస్ భరోసా, షీ టీమ్స్ గురించి పాటలు, నాటకం ద్వారా సందర్శకులకు అర్ధం అయ్యేలా అవ‌గాహ‌న క‌ల్పించారు.

సామాజిక అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న సైబరాబాద్ పోలీస్ జాగృతి కళా బృందం ‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here