శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మసీదుబండలో కొండాపూర్ డివిజన్, శేరిలింగంపల్లి డివిజన్ల బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఎం.రఘునాథ్ యాదవ్, ఎల్లేష్‌ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం నేపథ్యంలో జన జాగరణ కార్యక్రమంలో భాగంగా శోభాయాత్ర పేరిట బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు రవి కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మానికి అద్దం పట్టేలా రామ మందిర నిర్మాణం జరగాలన్నారు. హిందువులందూ ఏకం కావాలని, ప్రపంచంలోనే అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించేందుకు సహకారం అందించాలని ఓరారు. ప్రపంచం నలు మూలల నుంచి ప్రతి ఒక్కరూ రామ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.