రంగారెడ్డి జిల్లా (అర్బన్) బీజేపీ నూతన కార్యవర్గం ఎన్నిక

  • శేరిలింగంపల్లి నాయకులకు అధిక సంఖ్యలో జిల్లా కమిటీలో చోటు
  • బీజేపీ రాష్ట్ర కమిటీలో జ్ఞానేంద్ర ప్రసాద్‌కు స్థానం

రంగారెడ్డి జిల్లా ‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా (అర్బన్‌) బీజేపీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఎల్‌బీ నగర్‌కు చెందిన సామ రంగారెడ్డి నియామకం అయ్యారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా శేరిలింగంపల్లికి చెందిన డీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పోరెడ్డి బుచ్చిరెడ్డి, ఎల్‌బీ నగర్‌కు చెందిన రుద్రారపు శంకర్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శులుగా శేరిలింగంపల్లికి చెందిన చింతకింది గోవర్ధన్‌ గౌడ్‌, రాజేంద్ర నగర్‌కు చెందిన వై.శ్రీధర్‌, పిట్ట ఉపేందర్‌ రెడ్డి, కార్యదర్శులుగా శేరిలింగంపల్లికి చెందిన అనిల్‌ కుమార్‌ గౌడ్‌, ఎల్‌బీ నగర్‌కు చెందిన శేఖర్‌ గౌడ్‌, కె.పద్మారెడ్డి, రాజేంద్ర నగర్‌కు చెందిన మోంద్ర కొమరయ్యలు నియామకం అయ్యారు. కోశాధికారిగా శేరిలింగంపల్లికి చెందిన సోమిశెట్టి రమేష్‌, సహ కోశాధికారిగా ఎల్‌బీ నగర్‌కు చెందిన గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి, ఆఫీస్‌ కో సెక్రెటరీగా ఎల్‌బీ నగర్‌కు చెందిన ఆది నారాయణ రెడ్డి, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా ఎల్‌బీ నగర్‌కు చెందిన ఎన్‌.పవన్‌ కుమార్‌, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఎల్‌బీ నగర్‌కు చెందిన ఎన్‌.కృష్ణవేణి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా మహేశ్వరంకు చెందిన బాణాల ప్రవీణ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా ఎల్‌బీ నగర్‌కు చెందిన షకీల్‌ మీర్జా, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా శేరిలింగంపల్లికి చెందిన రాచమళ్ల నాగేశ్వర్‌ గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధులుగా శేరిలింగంపల్లికి చెందిన మారం వెంకట్‌, ఎల్‌బీ నగర్‌కు చెందిన తడకమళ్ల విజయ్‌ కుమార్‌, నీల ఆనంద్‌ కుమార్‌లు నియామకం అయ్యారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పెద్ద పీట…
రంగారెడ్డి జిల్లా (అర్బన్) బీజేపీ నూతన కార్యవర్గంలో శేరిలింగంపల్లికి చెందిన బీజేపీ నాయకులకు పెద్దపీట వేశారు. నియోజకవర్గానికి చెందిన నాయకులకు అధిక సంఖ్యలో జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారు. శేరిలింగంపల్లికి చెందిన డీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, పోరెడ్డి బుచ్చిరెడ్డిలు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా నియామకం అవగా, ప్రధాన కార్యదర్శిగా చింతకింది గోవర్ధన్‌ గౌడ్‌, కార్యదర్శిగా అనిల్‌ కుమార్‌ గౌడ్‌, కోశాధికారిగా సోమిశెట్టి రమేష్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా రాచమళ్ల నాగేశ్వర్‌ గౌడ్‌, అధికార ప్రతినిధిగా మారం వెంకట్‌లకు జిల్లా కార్యవర్గంలో చోటు దక్కింది. శేరిలింగంపల్లికి చెందిన మొత్తం 7 మందికి జిల్లా కమిటీలో చోటు దక్కింది.

రాష్ట్ర కార్యవర్గంలో ఒకరికి చోటు…
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర సీనియర్‌ నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్‌కు రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆయన నియామకం అయ్యారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here