మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కృషి చేస్తాః ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాం గూడ‌, టీఎన్జీవో ,ప్రశాంత్ హిల్స్ కాలనీ లలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , సీసీ రోడ్ల నిర్మాణం తో పాటు పలు అభివృద్ధి పనులు చేప‌ట్టాల‌ని మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీని కోరారు. సోమ‌వారం ఆయా కాల‌నీ వాసుల‌తో క‌లిసి మాజీ కార్పొరేట‌ర్ సాయిబాబా ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీని క‌లిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు. ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, సీసీ రోడ్ల ఏర్పాటు కు కృషి చేస్తానని అన్నారు. వీటితో పాటు ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ప్ర‌ధానంగా డ్రైనేజీ, రోడ్లు, మంచి నీరు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేసేలా చూస్తామ‌ని చెప్పారు. కాలనీ వాసులంద‌రూ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్‌ నాయకులు రమేష్ గౌడ్, నానాక్ రాం గూడ‌ గ్రామస్తులు నరేష్ సింగ్, డి. నారాయణ, అనిల్ గౌడ్, సాయి గౌడ్, టీఎన్జీవో కాలనీవాసులు జంగయ్య, శంకరయ్య, ప్రశాంతి హిల్స్ కాలనీవాసులు రమేష్ బాబు, రాజు తదితరులు ఉన్నారు.

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వ విప్ గాంధీకి విన‌తి ప‌త్రం అంద‌జేస్తున్న మాజీ కార్పొరేట‌ర్ సాయిబాబా
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here