రాయ‌దుర్గంలో భారతీయ నవయుగ సంఘం వ్యాయామ‌శాల‌ ప్రారంభం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః ప్ర‌తి రోజు వ్యాయామం చేయ‌డం ద్వారా మంచి ఆరోగ్యంతో పాటు శారీర‌క దారుఢ్యం మెరుగుప‌డుతుంద‌ని బిజెపి రాష్ట్ర నాయ‌కులు యం. రవికుమార్ యాద‌వ్‌, గ‌చ్చిబౌలి డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి. గంగాధ‌ర్ రెడ్డి అన్నారు. గ‌చ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో భారతీయ నవయుగ సంఘం వారు నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ వ్యాయామశాలను కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి, బిజెపి నాయ‌కులు యం. ర‌వికుమార్ యాద‌వ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ యువ‌కుల కోసం స్వ‌త‌హాగా వ్యాయామశాలను ఏర్పా టు చేయ‌డం ప‌ట్ల భారతీయ నవయుగ సంఘం ప్రతినిధులను అభినందించారు. నేటి పోటీ ప్రపంచంలో ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబ‌రుస్తున్నారు. ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండేందుకు వ్యాయామం చేయ‌డం చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. ఇలాంటి వ్యాయామశాలలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ దయాకర్, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, రాజు, శ్యామ్ యాదవ్, రమేష్ యాదవ్, వెంకటేష్ , సతీష్ గౌడ్, అశ్విన్, దేవి, గోపాల్, మన్నే రమేష్ , వరలక్ష్మి, ఇందిర, వ్యాయామశాల నిర్వాహకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


వ్యాయామ‌శాల‌ను ప్రారంభించిన బిజెపి నాయ‌కులు ర‌వికుమార్ యాద‌వ్‌, గ‌చ్చిబౌలి కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here