న్యూ ఇందిర‌న‌గ‌ర్‌లో పర్యటించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని న్యూ ఇందిరనగర్ కాలనీ లో రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని బిజెపి రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. సోమ‌వారం న్యూ ఇందిర‌న‌గ‌ర్ కాల‌నీలో ప‌ర్య‌టించారు. కాల‌నీలోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను స్థానికులు వారి దృష్టికి తీసుకువ‌చ్చారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని చెప్పారు. జిహెచ్ఎంసీ అధికారుల‌తో మాట్లాడి సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చూడాల‌న్నారు. గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు సంభవించినప్పుడు ప్రజలు ఎదుర్కిన్న‌ ఇబ్బందులను తొలగించేందుకు యుద్ధప్రాతిపదికన నాలాల పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, శేరిలింగంపల్లి బీజేవైఎం నాయకులు భరత్ సీనియర్, నాయకులు మన్నే రమేష్, న్యూ ఇందిరనగర్ కాలనీ సభ్యులు రంజాన్, సుబ్రమణ్యం, సాయి బాబా, మక్కన్ సింగ్, మధు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

న్యూ ఇందిర‌న‌గ‌ర్ కాల‌నీలో స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here