శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి లో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన శబరిమల మహా పాదయాత్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, భక్తులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వాములకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






