శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ విస్తృత ఎన్నిక ప్రచారం చేశారు. తన అనుచరులతో కలిసి ప్రచారం నిర్వహించారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారాస అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ తరపున ఎన్నికల ప్రచారంలో ఆమెతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాగంటి సునీతను శాలువాతో సత్కరించారు. అనంతరం అభ్యర్థితో కలిసి పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. రవీందర్ యాదవ్ తో పాటు పార్టీ ముఖ్యనేతలు స్థానిక ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. కేసీఆర్ పాలనలో అందిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాడు మున్సిపల్ మంత్రిగా హైదరాబాద్ ను అభివృద్ది చేసి ప్రపంచ నగరాల సరసన నిలబెట్టారని కొనియాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారాస ఘన విజయం సాధించబోతుందని, దాన్ని ఆపడం ఏ పార్టీ, ఏ నాయకుడి తరం కాదని రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.






