శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని PJR నగర్ లో మూడు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయల అంచనావ్యయంతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ మొదటి అంతస్తు నిర్మాణ పనులను, కాంపౌండ్ వాల్ (ప్రహరీ గోడ) నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణ పనులను, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. ప్రహరీ గోడ నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతున్న సమయంలో పగిలిన మంజీరా వాటర్ పైప్ లైన్ కు వెంటనే మరమ్మత్తు చేసి త్రాగు నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని జల మండలి అధికారులకు తెలిపారు. పీజేఆర్ నగర్ కాలనీ వాసుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని, అందరికి ఆమోదయోగ్యమైన ఫంక్షన్ హాల్ ను అన్ని హంగుల తో సకల సౌకర్యాల తో నిర్మిస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఫంక్షన్ హల్ పేద మధ్య తరగతి ప్రజలకు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఫంక్షన్ హల్ లో వివాహాది శుభకార్యాలు, సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు, జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ ఉపయోగపడుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, జి. రవి, CH. భాస్కర్, అగ్రవాసు, బాలస్వామి, పి.మహేష్, ప్రభాకర్, చంద్రయ్య, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






