నిరుద్యోగుల‌కు కేంద్రం ప్ర‌భుత్వం చేయూత: బీజేపీ రాష్ట్ర నాయ‌కులు క‌సిరెడ్డి భాస్క‌ర రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం నిరుద్యోగుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డనుంద‌ని బీజేపీ రాష్ట్ర నాయ‌కులు క‌సిరెడ్డి భాస్క‌ర రెడ్డి అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఉద్యోగ క‌ల్ప‌న కార్య‌క్ర‌మంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ ప‌రిధిలోని గోపన్ పల్లిలో తాండా నూతనంగా ఏర్పాటు చేసిన బీడీఆర్ ఎంట‌ర్ ప్రైజెస్ యూనిట్‌ ను సోమ‌వారం కేంద్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల క‌మిషన్ సభ్యులు పేరాల శేఖర్ రావు తో క‌లిసి బీజేపీ రాష్ట్ర నాయ‌కులు క‌సిరెడ్డి భాస్క‌ర రెడ్డి సంద‌ర్శించారు. బ్యాంకు ద్వారా రూ. 10 లక్షల ఋణం అందించి 15 శాతం సబ్సిడీ పొందే అవ‌కాశాన్ని యువ‌కుల‌కు క‌ల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంద‌న్నారు. ఈ ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మంది యువ‌త‌కు ఉపాధి ల‌బించింద‌న్నారు. ఈ యూనిట్ లో త‌యార‌వుతున్న సిమెంట్ మ్యాన్ హోల్స్‌, వివిధ ర‌కాల డిజైన్ టైల్స్‌తో పాటు సిమెంట్ ఉత్ప‌త్తుల‌ను ప‌రిశీలించిన‌ట్లు చెప్పారు.

బీడీఆర్ ఎంట‌ర్ ప్రైజెస్ యూనిట్ ను సంద‌ర్శించిన బిజెపి నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here