నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో కొనసాగుతున్న వరదనీటి కాలువ నిర్మాణ పనులను ఆదివారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో ఎక్కడా కూడ వరద ముంపు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే వరద నీటి కాలువ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐతే వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో త్వరిత గతిన పనులు పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.
మియాపూర్ డివిజన్ పరిధిలోని అల్లూరీ సీతారామరాజు నగర్ స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ప్రస్థుతం యూజీడీ నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతన్నయాని, ప్రాధాన్యతా క్రమంలో మిగిలిన సమస్యలన్ని పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిదులు పాల్గొన్నారు.
