నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడలోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్‌లో సేవాభారతి ఆద్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ సౌజన్యంతో చేపట్టిన ఈ శిబిరాన్ని స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బసవతారకరామ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కుమార్, విజయ్ సాయిలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారరు. ఈ సందర్భంగా వారు భారతమాత చిత్రపటం వద్ద పూజలు నిర్వహించి, రక్తం అందించిన దాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా విళయ తాండవం చేస్తున్న వేళ సరైన రక్తనిల్వలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దానికి తోడు కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న వారు కొద్దిరోజుల పాటు రక్తదానం చేయలేని పరిస్థితిల్లో తలసేమియా లాంటి తరచు రక్తం అవసరపడే రోగులు మరింత ఇబ్బందులు పడే పరిస్థితులను గుర్తెరికి సేవభారతీ లాంటి సంస్థ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యువత ఈ విషయాన్ని అర్థం చేసుకుని రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన యువతకు ఆయనప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డాక్టర్లు విజయ్ రామ్ రెడ్డి, ప్రభాకర్, చిన్న సిబ్బంది బాలు, కిరణ్, మోహన్ నాయక్, ఆర్ఎస్ఎస్ నిర్వాహణ బృంద సభ్యులు శ్రీనివాస్, ఈశ్వర్, బండారి విట్టల్, దారుపల్లి శ్రీనివాస్, ఈశ్వర్, సుదర్శన్, ఇండ్ల శ్రీనివాస్, యశ్వంత్, సేవ భారతి కార్యకర్తలు పాల్గొన్నారు.
