శేరిలింగంపల్లి, మార్చి 29 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పోగుల ఆగయ్య నగర్‌లో రహదారులపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై డ్రైనేజీ పొంగి పొర్లుతుండడం వల్ల దుర్వాసనతో ఇళ్లలో నివసించలేని పరిస్థితి నెలకొందన్నారు. రహదారులపై పాదచారులు నడవడం చాలా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు సైతం రహదారులపై ప్రయాణించాలంటే ఇబ్బందిగానే ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాని, డ్రైనేజీ నీరు రహదారులపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.