బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు విరివిగా చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేయాలి: రవికుమార్ యాదవ్

శేరిలింగంపల్లి, మార్చి 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వీలున్న ప్రతిచోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలుగు నూతన సంవత్సరం, ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి అండర్ బ్రిడ్జి ఆటో స్టాండ్ వద్ద, లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌ నెంబర్ 6 ల వద్ద లింగంపల్లి డివిజన్ కంటేస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు , తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన‌న్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని, ఈ వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల రోడ్లపై నడిచి తిరిగే పాదచారులు, ట్రాఫిక్ జామ్ లలో వాహన దారులు తాగడానికి సరైన మంచినీరు అందుబాటులో లేకపోవడం వలన చాలా మంది అనేక ఇబ్బందులు పడుతుంటార‌ని అన్నారు. వేసవి కాలంలో నీటిని సరిగా తాగకపోతే మన శరీరం డీహైడ్రేషన్ అయ్యి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంద‌న్నారు. చలివేంద్రం ఏర్పాటు చిన్న సేవా కార్యక్రమమే కావచ్చు మనల్ని చూసి ఇంకా కొంత మంది వారి వారి కాలనీ లలో ,బస్తీ లలో ఏర్పాటు చేస్తే మన వల్ల ఇంకొంత మంది పాదచారులకు మంచినీరు దొరుకుతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కిషోర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు సోమయ్య, రమేష్ ,శ్రీను , నరసింహ ,రాజేష్, నర్సింగ్ యాదవ్, నీలకంఠా రెడ్డి, సంజీవ్ రెడ్డి , కోటి ,మాధవి,సంతోష్ రెడ్డి, గోవింద్, కళ్యాణ్, అఖిల్ , మహేష్, సంతోష్ ,రంజిత్, శ్రీనివాస్, వెంకట్,వికాస్ ,రాహుల్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here