శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ అలై బలై చౌరస్తా నుంచి జీ పి ఆర్ ఎ క్వార్టర్స్ ప్రధాన రహదారి పై రూ.44.59 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ మల్లికార్జున్ , డిఈ కవితలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సెంట్రల్ లైటింగ్ ద్వారా రాత్రి సమయంలో రహదారిపై ప్రయాణించే ప్రజలకు మెరుగైన రహదారి దృశ్యత లభిస్తుందని తెలిపారు.
గచ్చిబౌలి ప్రాంతంలో స్మార్ట్ సిటీ ప్రమాణాలకు అనుగుణంగా రహదారి అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.గచ్చిబౌలి డివిజన్‌లో రహదారి సౌకర్యాలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా,నాణ్యతతో పూర్తిచేసిన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఈఈ మల్లికార్జున్, డీఈ కవిత , సూపర్వైజర్ మహేష్ రెడ్డి, రాజు, పవన్, డివిజన్ నాయకులు, టీఎన్జీవోస్ కాలనీ వాసులు, సీనియర్ నాయకులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.