వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మాణం అయ్యే వరకు ప్రజలు అందులో భాగస్వాములు కావాలని వివేకానందనగర్ డివిజన్ బీజేపీ నాయకురాలు ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ పిలుపునిచ్చారు. డివిజన్ పరిధిలోని రిక్షా పుల్లర్ కాలనీ, రామకృష్ణ నగర్ లలో ఆమె మంగళవారం మహిళలను కలిశారు. అయోధ్య రామమందిరం తీర్థ ట్రస్ట్ సూచన మేరకు భవ్య రామమందిర నిర్మాణంలో భారత దేశంలోని 4 లక్షల గ్రామాలను భాగస్వాములను చేసే క్రమంలో కాలనీలలోని మహిళలను కలుసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజుల, ఉప్పల శృతి పాల్గొన్నారు.