శిష్టకరణ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః శిష్టకరణ సంక్షేమ సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశాన్ని సోమ‌వారం చందానగర్ ఫ్రెండ్స్ కాలనీ లో జాతీయ శిష్టకరణ ఒ.బి.సి సాధన కమిటీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించారు. ఫ్రధాన అజెండా ఆంశాలైన ఓబీసీ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ, శిష్టకరణ కులాభివృద్ది, సంక్షేమం ఆంశాలపై కార్య‌వ‌ర్గం చ‌ర్చించింది. క‌రోనా నివార‌ణ‌లో భాగంగా శిష్ట‌ కరణం కోవిడ్ 19 హెల్ప్ లైన్ హైద‌రాబాద్ వారు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇందులో భాగంగా జాతీయ ఓబీసీ కన్వీనర్ శ్రీ డీ వీ కృష్ణారావు 60వ వసంతోత్సవం సందర్భంగా వారిని సతీ సమేతంగా కార్యవర్గం తరపున కేక్ కట్ చేయించి, ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన శిష్టకరణ ఐక్యవేదిక,లేఖ పత్రిక బృంధ సభ్యులు ధశమంతుని నరేష్ కుమార్ , మంత్రి నరసింహ రావు, శేఖరమంత్రి నరహరి నాధ్, జే వి చంద్రబాబులకు జాతీయ శిష్టకరణ ఓబీసీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. శిష్టకరణ ఐక్య వేదిక, లేఖ ప్రధమ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు హరగోపాల్, ఆర్. శేషగిరిరావు, గౌరవ సలహాదారులు పార్ధసారధి, కోశాధికారి యు. పార్వతీరావు, అడిషనల్ ప్రధాన కార్యదర్శులు డొంకాడ అనంత ప్రసాద్, మోటూరి నారాయణ రావు, సంయుక్త కార్యదర్శి ప్రకాష్ రావు, మహిళా కార్యదర్శి అరసాడ సత్యలక్ష్మీ , మోటూరి జయశ్రీ, కోట శేషారత్నం, సభ్యులు బీటీ రమేష్ , కొట్టక్కి వెంకటేశ్వరరావు, ధిల్లీ శంకర్ పట్నాయక్, శంకర్ పట్నాయక్ , ఆనంద్ పట్నాయక్ , డి. సంతోష్, ఛౌదరి దుర్గా ప్రసాద్ తో పాటు అనేక మంది సభ్యులు పాల్గొన్నారు.

శిష్టకరణ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న స‌భ్యులు

 

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here