మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మట్కా మహబూబ్ పేట్ లో బిజెపి నాయకుడు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ చిత్రపటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మియాపూర్ డివిజన్ బిజెపి ఇన్చార్జి కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోన వ్యాధిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను తీసుకురావడంతో పాటు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించిన ప్రధాని మోడీకి దేశ ప్రజలంతా రుణపడి ఉంటారని అన్నారు. కరోనా వ్యాధిని భారత్ ఎలా ఎదుర్కొంటుందో అని అనుమానంతో చూసిన దేశాలు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంపట్ల ఆశ్చర్య పోతున్నాయని అన్నారు.
గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ సమర్థవంతమైన పాలనకు కరోన వ్యాక్సినేషన్ ఒక గొప్ప నిదర్శనమన్నారు. వ్యాక్సిన్ వచ్చేసిందని ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండరాదని, తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే అని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం యాదవ్, జాజెరావు, రాము, శివ, మసిరెడ్డి, మల్లేష్, సోను, కుమార్ యాదవ్, రమేష్, వినోద్ యాదవ్, నాగేశ్వరరావు, కొంచ శివరాజ్ ముదిరాజ్, బాబు ముదిరాజ్, శీను తదితరులు పాల్గొన్నారు.