నార్సింగి (నమస్తే శేరిలింగంపల్లి): నార్సింగి మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ హాజరయ్యారు. స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కరుణాకటాక్షాలు అందరి మీద ఉండాలని అన్నారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, రైతన్నలు, దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భేరీ రామచందర్ యాదవ్ సైన్యం రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ జీడి కంటి మహేందర్ యాదవ్, పెద్ద గొల్ల మధు యాదవ్, బండారి మల్లేష్ యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అందెల సత్యనారాయణ యాదవ్, నాగపురి శ్యామ్ యాదవ్ పాల్గొన్నారు.