కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస యూత్ నాయకుడు అఖిల్ పటేల్ ఆధ్వర్యంలో మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్ ఎ బ్లాక్‌లోని కాంగ్రెస్ యువత కొండాపూర్ టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులో తెరాస పార్టీలో చేరారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు గత ఐదు సంవత్సరాలుగా కొండాపూర్ డివిజన్ లో చేసిన అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరారని అఖిల్ పటేల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరారని పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో తెరాస జెండా ఎగుర వేయడం ఖాయమన్నారు. ప్రజలు తెరాసకే మళ్లీ ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి విశేష రీతిలో స్పందన లభిస్తుందన్నారు. తెరాస చేపట్టిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు.

