చందానగర్(నమస్తే షెర్లిలింగంపల్లి): దివంగత నేతలు వైఎస్సాఆర్, పీజేఆర్ ల స్ఫూర్తి తో చందానగర్ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డి.నిజాముద్దీన్ అన్నారు. మంగళవారం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అక్సారిబేగం కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీలలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం నిజాముద్దీన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలోనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, శేరిలింగంపల్లి ప్రాంతంలో దివంగత నేత పీజేఆర్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు.

వైయస్ఆర్ స్పూర్తితో, పీజేఆర్ చూపిన బాటలో పయనిస్తూ ప్రజాసేవ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచామన్నారు. డివిజన్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, రాజా పటేల్, రాజన్, పాషా, షబానా ఖాజా, జావేద్ హుస్సేన్, నందు, ప్రవీణ్, అమిత్ అగర్వాల్, గణేష్ ముదిరాజ్, రాజేష్ నాయక్, నందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
