పేద కుటుంబానికి అండగా నిలిచిన కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతు‌న్న పేద కుటుంబానికి చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అండగా నిలిచారు. చికిత్స కోసం తనవంతుగా ఆర్థిక సహాయం అందించగా నెలవారీ మందుల కోసం మల్ బార్ గోల్డ్ వారి సహకారంతో నెలనెలా మందుల‌ను అందజేసేందుకు ముందుకువచ్చారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో ప్రవీణ్ కు చెందిన రెండు కిడ్నీలు చెడిపోవడంతో కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అతని చికిత్స కోసం చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గతంలో ఆర్థిక సహాయం అందించారు. ప్రవీణ్ భార్య సమీర తన కిడ్నీని భర్తకు అందించి చికిత్స చేయించారు. ప్రవీణ్ సమీరా దంపతులకు ప్రతి నెల మందులకు దాదాపు రూ. 30 వేల వరకు ఖర్చు అవుతుందని కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డికి తెలపడంతో చందానగర్ లోని మాలబార్ గోల్డ్ వారి సహాయంతో ప్రతి నెల మందులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి చేతుల మీదుగా ప్రవీణ్ సమిరా ఉచితంగా మందులను అందజేశారు. సహయం చేయడానికి ముందుకు వచ్చిన మాలబార్ గోల్డ్ యాజమాన్యానికి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాలబార్ గోల్డ్ డైరెక్టర్ కృష్ణన్, చందానగర్ మాలబార్ మార్కెటింగ్ మేనేజర్ లంకేష్ తదితరులు పాల్గొన్నారు.

మలబార్ గోల్డ్ సౌజన్యంతో కిడ్నీ సంబంధిత వ్యాధి చికిత్స చేయించుకున్న బాధితులకు నెలవారీ మందులను అందజేస్తున్న చందానగర్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here