శేరిలింగంపల్లి, అక్టోబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేట్ గ్రామంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మియాపూర్ డివిజన్ నాయకులతో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జాతిపితకు ఘన నివాళులర్పించారు. అనంతరం గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. సత్యం, అహింసను ఆయుధాలుగా చేసుకుని మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. కోట్లాది మంది భారతీయులకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సత్యం, అహింస, శాంతి, సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని శ్రీకాంత్ అన్నారు. మహాత్మా గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు.





