నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ విలేజ్, ఖానామెట్, ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీల్లో పర్యటించి మౌలికవసతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ప్రశాంత్, వాటర్ వర్క్స్ మేనేజర్ నివర్థీ, ఎస్ఆర్ పి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు గంగుల గణేష్ యాదవ్, శ్యామ్, సయ్యద్ సర్వర్, నరహరి యాదవ్, వార్డ్ సభ్యులు రాంచందర్, లోకేష్, కృష్ణ తైలి, సయ్యద్ కరీమ్, సయ్యద్ అసద్, సయ్యద్ రఫిక్, సయ్యద్ షకీల్, రంగ స్వామి, కేశవులు, కృష్ణ నాయక్, సయ్యద్ శైబజ్, నర్సింగ్ నాయక్, కోటేష్, శ్రీనివాస్ గుప్త, లింగ బాబు, శ్రీనివాస్ నాయక్, వెంకట్ నాయక్, మహిళలు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.