నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రంగపురం కాలనీలో జీహెచ్ఎంసీ అధికారులు నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉప్పలపాటి శ్రీకాంత్ సూచించారు. శానిటేషన్ సిబ్బందితో కలిసి రోడ్లపై ఉన్న మట్టి కుప్పలను, చెత్తా చెదారాన్ని తొలగించారు. డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు తన దృష్టికి తీసుకురాగా ఇంజనీరింగ్ విభాగపు అధికారులతో మాట్లాడి పెండింగ్ పనులను త్వరిత గతిన చేపట్టి, పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ నోడల్ ఆఫీసర్ రామ్మోహన్ రావు,ఎస్ ఆర్ పి కనకరాజు , జీహెచ్ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది, కాలనీ ప్రతినిధులు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
