నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్ జన్మదిన వేడుకలు శుక్రవారం మసీద్‌బండలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజు యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మొక్కలు నాటారు. పార్టీ నాయకులతో కలిసి జన్మదిన కేకును కట్ చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావుతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్డు మెంబర్ పొడుగు రాంబాబు, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ యాదవ్, పద్మారావు, కుంచాల రమేష్, ఆర్గనైజర్ సెక్రటరీ వేణు గోపాల్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ గణేష్ గుప్తా, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, లింగం శ్రీనివాస్, మహేష్ యాదవ్, అక్తర్, రమణ, పవన్, మహేష్ తదితరులు ఉన్నారు.