శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): డిప్యూటీ కమీషనర్ పి. మోహన్ రెడ్డి అధ్యక్షతన పట్టణ ప్రణాళిక విభాగంతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ కమీషనర్ మాట్లాడుతూ… సర్కిల్ పరిధిలోని ప్రజలకు అనధికార ప్లాట్లు, లేఔట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మరోసారి కల్పించిన లే అవుట్ రెగ్యులైజేషన్ (ఎల్ ఆర్ ఎస్) పథకాన్ని ప్రకటించిందని, దీనిపై ఫీజులో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఎల్ ఆర్ ఎస్ 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సర్కిల్ పరిధిలో 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 2025 వరకు క్రమబద్దీకరించు కోవాలని, ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు. ఫీజు చెల్లించేందుకు సర్కిల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దరఖాస్తుదారుడికి సందేహాలుంటే ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ నాగి రెడ్డి, టీపీవో శ్రీనివాస్ రెడ్డి, చైన్మెన్ లు, జూనియర్ అసిస్టెంట్ లు, NAC ఇంజనీర్ లు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.