శేరిలింగంపల్లి, మార్చి 4 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీ ఎ, బి, సి బ్లాక్‌లలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి అన్నారు. స్థానికంగా ఉన్న ప్లాట్ నెంబర్ 432 C బ్లాక్ లో నిర్మాణదారుడు జిహెచ్ఎంసి అధికారులను మభ్యపెట్టి రెండు అంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడు అంతస్తుల నిర్మాణం చేపట్టాడని అన్నారు. ఇలా ఎవరికీ వారు ఇష్టారాజ్యంగా రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఏడు ఎనిమిది అంతస్తులు నిర్మిస్తుంటే పక్కనే ఉన్న ఫ్లాట్ యజమానుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మౌలిక సదుపాయాల పరిస్థితి ఏమిటని అన్నారు. తాము గతంలోనే ఈ విషయాన్ని తెలియజేశామని, కానీ అధికారులు పట్టించుకోలేదని, ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని మల్లారెడ్డి ప్రజావాణిలో కోరారు. ఈ సందర్భంగా ఆయన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.