శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాంనగర్ కాలనీ RS బ్రదర్స్ షో రూమ్ వద్ద జాతీయ ప్రధాన రహదారిపై ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ మియాపూర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర లో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీకృష్ణ పరమాత్ముడి నామస్మరణతో నగరం పులకరించింది. జగన్నాథ రథయాత్ర ఆద్యంతం ఆధ్యాత్మికతను ద్విగుణీకృతం చేసింది. జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా సాగింది. హరే కృష్ణ.. హరే రామ భజనలు, నృత్యాలతో భక్తులు పారవశ్యం చెందారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు మర్రపు గంగాధర్ రావు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.