శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండాలో జరిగిన హాథిరామ్ బాబా జయంతి వేడుకలలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్, జగన్ నాయక్, SP నాయక్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ హథీరామ్ బాబా అయోధ్యకు చెందిన ఒక సాధువు అని అన్నారు. ఆయన తిరుమలకు తీర్థయాత్రకు వచ్చి వేంకటేశ్వర స్వామి భక్తుడిగా మారారు. ఆయన తిరుమలలోనే ఒక మఠాన్ని స్థాపించి అక్కడే నివసించారు. హథీరామ్ బాబా భక్తి, నిస్వార్థ సేవలకు ప్రసిద్ధి. ఆయన మరణానంతరం, ఆ మఠం హథీరామ్ బాబా మఠం అని పిలవబడింది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్ రావు, దామోదర్ రెడ్డి, గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్, తిరుపతి నాయక్, సీతారాం నాయక్, శంకర్ నాయక్, గోపి నాయక్, రెడ్యానాయక్, రాఘవేంద్ర, కృష్ణ నాయక్, లక్ష్మణ్ నాయక్, లకపతి నాయక్, పీర్య నాయక్, హరి నాయక్, మోహన్ నాయక్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.