మంద కృష్ణమాదిగకి పద్మశ్రీ అవార్డ్ రావడం హర్షణీయం.. రవికుమార్ యాదవ్..

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే , ఇంఛార్జి రవికుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు పొందిన ప్రతి తెలుగు వారికి అభినందనలు తెలియజేశారు. ప్రజా వ్యవహారాలలో పద్మశ్రీ అవార్డ్ పొందిన మంద కృష్ణ మాదిగకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ అవార్డ్ ఆయనకు ఎప్పుడో రావాలని, 1999 నుండి ఆయన ఎమ్మార్పీఎస్ ను స్థాపించి ఎస్సీల అభ్యున్నతి కొరకు నిర్విరామ పోరాటం చేస్తూన్న గొప్ప యోధులని కొనియాడారు. మొన్న ఎస్సీ వర్గీకరణ తీర్పు వెనుక ఆయ‌న‌ కృషి , ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారని , ఇలాంటి వారికి ఇప్పటికైనా గుర్తింపు దక్కడం చాల ఆనందకరమైన విషయమన్నారు. అర్హులైన వారికి అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here