శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఎంఆర్ హైలాండ్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్బంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి అసోసియేషన్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఆర్ అసోసియేషన్ అధ్యక్షులు సామా నర్సిరెడ్డి,అసోసియేషన్ సభ్యులు లక్ష్మణ్ రావు, పిచ్చయ్య, మల్లారెడ్డి,నవీన్, కళ్యాణ్, వేదశ్రీ, సుగుణ, శోభ, బాలరాజు, శ్రీ జయతిర్ధ , హరికిషోర్, వాణి, భాస్కర్ రెడ్డి, కొణిదేనా కృష్ణ రావు, విశ్వనాధం ,పద్మ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.