శేరిలింగంపల్లి, జనవరి 28 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్యనగర్, గచ్చిబౌలి, స.నెం.134,145,136 ప్రభుత్వ భూమిలో APHB లేఅవుట్ లో గల 1 ఎకరా 20 గుంటల పార్కు స్థలాన్ని కబ్జానుండి కాపాడాలని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతియాదవ్ జోనల్ కమీషనర్ కు లేఖ ఇచ్చారు. సోమవారం ప్రజావాణిలో ఆయన జోనల్ కమీషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో తాను ఎమ్మెల్యేగా ఉన్న 2014 లో ప్రభుత్వ నిధులతో పార్కును సూచించే బోర్డుతో పాటు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.
తదనంతరం పార్కును సూచించే అభివృద్ధి పనులను తొలగించి, పార్కు బోర్డును కూడా తొలగించి, దొంగ పట్టాలు, అధికారులతో కలిసి అవినీతికి పాల్పడి అనుమతులు తీసుకొని అక్రమ మార్గాన పార్కును అన్యాక్రాంతం చేస్తున్నారని తన ఫిర్యాదు లేఖలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. పార్కు కబ్జాపై చర్యలు తీసుకొని పార్కును వెంటనే కాపాడాలని జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డిని బిక్షపతియాదవ్ కోరారు.