శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఎ బ్లాకు, చిరాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఐ మాస్టర్ ఆపిల్ సర్వీస్ సెంటర్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఐ మాస్టర్ ఆపిల్ సర్వీస్ సెంటర్ యాజమాన్యం హరీష్ హష్మీకి శుభాకాంక్షలు తెలియజేసి, మరిన్ని శాఖలుగా విస్తరించి, వ్యాపారాభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ హమీద్ పటేల్ తోపాటు సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, భాస్కర్ ముదిరాజ్, హరీష్ రావు, ఉమర్, సమీర్ లాలా, అతిఫ్, మధు, హరీష్, శ్రీకాంత్, భరత్, వెంకటేష్, నిఖిల్, శ్రీనివాస్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.






