శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 50వ జన్మదినం సందర్భంగా ఉమ్మడి చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి కే టీఆర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహించబోయేది కేటీఆర్ అని జోస్యం చెప్పారు. ఆయన సారథ్యంలో పార్టీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారుడు మల్లికార్జున శర్మ, స్థానిక బిఆర్ఎస్ నాయకులు సలీం, చందర్ రావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






