SIRపై కాంగ్రెస్ ఫోకస్.. ప్రజాస్వామ్య పరిరక్షణకు కార్యకర్తలు ముందుండాలి: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జూలై 24 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ముందుండాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో ప్రతి నాయకుడు, కార్యకర్త చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం వెంకటేశ్వర నగర్ డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీ, పాపి రెడ్డి నగర్, పాపారాయుడు నగర్, దీనబంధు కాలనీ, హనుమాన్ నగర్, ప్రగతి నగర్, ఆర్పీ కాలనీ, వెంకటేశ్వర నగర్, రామకృష్ణ నగర్ కాలనీల్లో బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక నాయకులతో కలిసి SIR కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మహిళా నాయకురాలు ఏకాంత్ కల్పన గౌడ్, భాష్పక యాదగిరి, శివకుమార్, ఎల్లారెడ్డి, విష్ణు, పట్వారి శశిధర్, కావూరి ప్రసాద్, పరశురాం, కృష్ణ, మన్నేపల్లి సాంబశివరావు, ముత్తయ్య, ఆంజనేయులు, రాజు, వెంకటేష్, మెహమూద్, ఏకనాథ్, మిరాజ్, నాగేందర్, ఉదయ్, రాంచందర్ గౌడ్, రవికుమార్, యూత్ కాంగ్రెస్ నాయకుడు వసీం, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సామ్సన్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here