బోయిన్ పల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలు

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బోయిన్‌ప‌ల్లి కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడుతూ ముద్దం నరసింహ యాదవ్ ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ప్రజాసేవ చేస్తూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నా అంటే నేనున్నా అని పలికే నాయకుడు అని అన్నారు. ఆయ‌న ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతోమందికి కంటి పరీక్షలు నిర్వ‌హించారు. కంటి చూపు సరిగా లేని వారికి డాక్టర్లతో పరీక్షలు చేయించి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ యాదవ్, బిల్డర్ కృష్ణారావు, బిసి నాయకులు, సాఫ్ట్‌వేర్ త్రినాథ్ యాదవ్, పెరుగు రమేష్ యాదవ్, గడ్డం కృష్ణ యాదవ్, ఎద్దుల రాజు యాదవ్, ఒగ్గు కృష్ణ యాదవ్, ముద్దం ఆనంద్ యాదవ్, నరేందర్ యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, కర్రే జంగయ్య యాదవ్, బర్రె యాదయ్య పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here