శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి డివిజన్ డొయిన్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ కిడ్స్ ప్రీ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్కూల్ వ్యవస్థాపకుడు నరేందర్ యాదవ్ ఆహ్వానం మేరకు హాజరైన రవికుమార్ యాదవ్, నూతన విద్యాసంస్థను ప్రారంభించిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ విద్య అంటే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. చిన్నారులు నేర్చుకునే తొలి దశ ఇదేనని, ఆధునిక సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నరేందర్ యాదవ్, మహేష్, విజయలక్ష్మి, ప్రమీల, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.






