శేరిలింగంపల్లి, జూలై 24 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ డివిజన్, బాగ్ అమీర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు విద్యార్థులకు బ్యాగులు, ప్లేట్లు, ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవరం రంగారావు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, భోజన ప్లేట్లతోపాటు క్యారమ్ బోర్డులు, చెస్ బోర్డులు, స్కిప్పింగ్ రోప్స్, స్నేక్ అండ్ లాడర్స్, చైనీస్ చెక్కర్స్, పజిల్ గేమ్స్, రింగ్ బాల్స్, లూడో గేమ్స్ వంటి క్రీడా సామగ్రిని అందజేసినట్లు చెప్పారు. ఈ ఆట సామగ్రిని విద్యార్థులు తమ మానసిక ప్రశాంతత, మేధో వికాసం కోసం వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్, సీనియర్ నాయకులు గొట్టుముకుల పెద్ద భాస్కరరావు, మాచర్ల భద్రయ్య, తీగల కృష్ణారావు, విజయలక్ష్మి, సంజీవరావు, జగదీష్ గౌడ్, యాదయ్య, సతీష్, రవీందర్ రావు, మురళి, కిరణ్, బాబు, అనిల్, ప్రవీణ్, నవీన్, మల్లేష్, సంతోష్, శ్రీరామ్, శ్రీనివాస్, నరహరి, సంపత్, హరీష్, నరేష్, శ్రీధర్ రావు, అఖిల్, శ్రీనివాస్, జైకుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.





