శేరిలింగంపల్లి, జూన్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో మదీనాగూడ గ్రామంలో శుక్రవారం బొడ్రాయి(నాభిశిల) 41వ రోజు మహోత్సవం సందర్భంగా మదీనాగూడ బొడ్రాయి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు, భక్తులు బొడ్రాయికి భక్తిశ్రద్ధలతో జలాన్ని పోసి ప్రత్యేక అభిషేకాలను, పూజలు చేశారు. అలాగే గ్రామ దేవతలకు యజ్ఞహోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాన పండిత వేదబ్రహ్మణులు , ఇతర పండితులు వేదమంత్రోశ్చరణలతో బొడ్రాయికి, గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని మహిళలు బొడ్రాయికి, గ్రామ దేవతలకు జలాలను పోసి ప్రత్యేక అభిషేకాలను, కుంకుమార్చన, పూజలను చేసి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మదీనాగూడ గ్రామ పెద్దలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.